గిద్దలూరు: పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో పెరిగిపోయిన తీవ్ర ఉష్ణోగ్రతలు, జాతీయ రహదారిపై ఆందోళన వ్యక్తం చేస్తున్న వాహనదారులు
పశ్చిమ ప్రకాశం ప్రాంతంలోని గిద్దలూరు, కంభం, బెస్తవారిపేట పరిసర ప్రాంతాలలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పగటిపూట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతుండడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. రోడ్లు కూడా విపరీతంగా వేడికి పోతుండడం వల్ల వాహనాలలో ప్రయాణిస్తున్న సమయంలో టైర్లు పేలిపోతల సంఘటనలు జరుగుతున్నాయి. ఎండ విపరీతకు ఉన్న సమయంలో వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ హర్షవర్ధన్ రాజు హెచ్చరిస్తున్నారు.