గోపాలపురం: దేవరపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం: కల్వర్టును ఢీకొట్టిన సౌండ్ సిస్టం వ్యాన్
తూగో జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో, సౌండ్ సిస్టం వ్యాన్ కల్వర్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో వ్యాన్లో ఉన్న ముగ్గురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను గోపాలపురం ఆరోగ్య కేంద్రానికి తరలించి, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.