వైద్య ఆరోగ్య శాఖలో కూటమి ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుంది : ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు
గోపాలపురం ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మంగళవారం ప్రమాణ స్వీకారం చేసింది. కమిటీ చైర్మన్గా ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఉండగా, డైరెక్టర్లుగా పడమటి శ్రీనివాసరావు, పెనుగొండ శ్రీనివాస్, పోసిన గణపతి ప్రమాణం చేశారు. ఆసుపత్రి అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖలో కూటమి ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని ఎమ్మెల్యే చెప్పారు.