కొండపి: జరుగుమల్లి మండలం పాలేరు సమీపంలో ఆటోని ఢీకొట్టిన ద్విచక్ర వాహనం, ప్రమాదంలో బీటెక్ విద్యార్థి మృతి
ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం పాలేరు సమీపంలోని 16 నెంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం ద్విచక్ర వాహనం ఆటోని ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థి చిన్న కోటిరెడ్డి మృతి చెందాడు. గుంటూరుకు చెందిన చిన్న కోటిరెడ్డి తిరుపతిలో బీటెక్ చదువుతున్నాడు. సెలవులపై ఇంటికి వెళుతున్న క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందాడు. పోలీసులు ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు.