దేవరుప్పుల: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదుకు మరో అవకాశం: డిసెంబర్ 10 వరకు గడువు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదుకు ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. డిసెంబర్ 10 వరకు అర్హులైన పట్టభద్రులు తమ ఓటును నమోదు చేసుకోవచ్చు. ఈ విషయాన్ని దేవరుప్పుల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దావెర అనిల్ కుమార్ వెల్లడించారు. ఈ నెల 25న ముసాయిదా, డిసెంబర్ 30న తుది జాబితా విడుదల కానుంది.