గిద్దలూరు: కంభం లోని ఎంఆర్ఎఫ్ టైర్స్ షోరూమ్ లో చోరీ చేసిన దొంగలు, సీసీ కెమెరాలు రికార్డు అయిన నిందితుల కారు దృశ్యాలు
మార్కాపురం జిల్లా కంభం పట్టణంలోని అమరావతి, అనంతపురం జాతీయ రహదారిపై ఉన్న ఎంఆర్ఎఫ్ టైర్స్ షోరూమ్ లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. అర్ధరాత్రి సమయంలో షోరూం షట్టర్ తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు కౌంటర్లోని లక్ష రూపాయల నగదును దొంగలు అపహరించి తీసుకువెళ్లారు. ఉదయాన్నే షోరూం కి వచ్చిన నిర్వాహకులు దొంగలు పడ్డారన్న విషయాన్ని గుర్తించారు. తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు క్లూస్ టీం ని రంగంలోకి దించారు. అలానే పట్టణంలోని ఓ పర్నిచర్ షాప్ లో దొంగలు చోరీ చేసేందుకు విఫల యత్నం చేశారు. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.