తాడిపత్రి: తాడిపత్రిలో హనుమాన్ భక్తమండలి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు
తాడిపత్రిలో గురువారం హనుమాన్ జయంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. హనుమాన్ భక్తమండలి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేయడంతో పాటు ర్యాలీ నిర్వహించారు. ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని ప్రత్యేకంగా అలంకరించిన ట్రాక్టర్లో ఉంచి పట్టణంలో ఊరేగించారు. బైక్ ర్యాలీ కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి మాట్లాడారు. ప్రతి ఒక్కరికీ హనుమంతుడు మాదిరి ధైర్య సాహసాలు ఉండాలని ఆకాంక్షించారు. అందరూ హనుమంతుని పూజించాలన్నారు.