రాయదుర్గం: పట్టణంలో రైలు ఢీకొని తీవ్రంగా గాయపడిన వృద్ధురాలు, పరిస్థితి విషమం
రాయదుర్గం పట్టణంలో రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఢీకొని శంకరమ్మ అనే వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. స్థానికుల వివరాలమేరకు చంద్రబాబు కాలనీలో నివాసం ఉంటున్న ఆమె గురువారం రాత్రి రైల్వే ట్రాక్ వద్దకు బహిర్భూమికి వెళ్లింది. ఆ సమయంలో రైలు వచ్చి ఢీకొనింది. తీవ్ర గాయాలతో ఉన్న ఆమెను 108 అంబులెన్స్ లో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తలకు కాళ్లకు బలమైన గాయాలు కావడంతో ఆమె పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది.