రాయదుర్గం: నియోజకవర్గంలో ఉత్సాహంగా టిడిపి మహానాడు లో పాల్గొన్న వేలాది మంది నాయకులు కార్యకర్తలు
రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా 10 క్లస్టర్ లలో తెలుగుదేశం మహానాడు కు పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. బుధవారం ఉదయం టిడిపి జెండా ఆవిష్కరణ అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డిజిటల్ స్క్రీన్ లలో అధినేత ప్రసంగం సహా నాయకుల ఉపన్యాసాలు వీక్షించారు. పట్టణంలో ఎమ్మెల్యే తనయుడు యువనేత కాలవ భరత్, టంకశాల హనుమంతు, బండి కృష్ణమూర్తి, కడ్డిపూడి మహబూబ్ బాషా, పొరాళ్ల పురుషోత్తం, ఇనాయత్, పసుపులేటి నాగరాజు, గుమ్మగట్ట మండలంలో కన్వీనర్ కాలువసన్నన్న, డి.హిరేహాల్ మండలంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ గొడిశలపల్లి హనుమంతరెడ్డి, ఆర్యవైశ్య కార్పోరేషన్ డైరెక్టర్ నాగళ్ళిరాజు పాల్గొన్నారు.