కొండపి: సింగరాయకొండ జాతీయ రహదారిపై లారీని వెనకనుంచి ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, డ్రైవర్కి తీవ్ర గాయాలు, ప్రయాణికులు సురక్షితం
గుంటూరు నుంచి తిరుపతికి వెళుతున్న ఏపీఎస్ఆర్టీసీ బస్సు ప్రకాశం జిల్లా సింగరాయకొండ 16 నెంబర్ జాతీయ రహదారిపై ఓ లారీని వెనకనుంచి ఢీ కొట్టింది. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ప్రమాదంలో బస్సు డ్రైవర్ కు తీవ్ర గాయాలు కావడంతో అంబులెన్స్ లో ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. బస్సులో ఉన్న 31 మంది ప్రయాణికులు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. జరిగిన ప్రమాదంపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు.