గిద్దలూరు: గిద్దలూరు పట్టణ మరియు రూరల్ పోలీస్ స్టేషన్లలో హిజ్రాలకు కౌన్సిలింగ్ ఇచ్చిన సీఐలు, సురేష్, రామకోటయ్య
మార్కాపురం జిల్లా గిద్దలూరు పోలీస్ స్టేషన్ ఆవరణలో శుక్రవారం రాత్రి 7 గంటలకు హిజ్రాలకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. సీఐ లు సురేష్, రామకోటయ్య హిజ్రాలకు పలు సూచనలు చేశారు. ప్రజలతో స్నేహభావంగా ఉండాలని డబ్బులు అడిగేటప్పుడు ఇచ్చిన వారి వద్ద మాత్రమే తీసుకొని డబ్బులు ఇవ్వని వారిని ఇబ్బందులకు గురి చేయవద్దని విజ్ఞప్తి చేశారు. చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఎవరిపైనైనా దాడికి పాల్పడడం లేదా గాయపరచడం వంటివి నేరమని దానికి చట్టపరమైన శిక్షలు తప్పవు అని వారిని హెచ్చరించారు