మార్కాపురం: జిల్లా కేంద్రంలోని పూల సుబ్బయ్య కాలనీలో రోడ్డుపై మద్యం బాబులు విరంగం
మార్కాపురం జిల్లా కేంద్రంలోని పూల సుబ్బయ్య కాలనీ ఓ రెస్టారెంట్ సమీపంలో రోడ్డుపై మద్యం బాబులు విరంగం సృష్టించారు. పబ్లిక్ గా ముగ్గురు యువకులు గొడవకు దిగారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన సీఐ ఆల్తాఫ్ హుస్సేన్ సిబ్బందిని పంపించారు. పోలీసులు ఆ మద్యం బాబులను పోలీస్ స్టేషన్ కు తరలించారు. వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తామని సిఐ తెలిపారు.