కొండపి: టంగుటూరు మండలం కొనిజేడు సమీపంలో ఓ వ్యక్తి మృతి, కుళ్ళిపోయిన మృతదేహం, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కొనిజేడు గ్రామ సమీపంలో గురువారం ఓ వ్యక్తి మృతి చెందిన విషయం వెలుగులోకి వచ్చింది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల మేరకు సాకి సుహానా అనే వ్యక్తి మృతి చెంది ఉన్నాడని చనిపోయి చాలా రోజులు కావడంతో అతని మృతదేహం గుర్తుపట్టలేని విధంగా కుళ్ళిపోయినట్లుగా పోలీసులు చెబుతున్నారు. పోస్టుమార్టం కొరకు మృతదేహాన్ని ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలిస్తున్నట్లు ఎస్సై నాగమల్లేశ్వరరావు తెలిపారు.