రాయదుర్గం: కణేకల్లు ఎంపిడిఓ విజయ సింహరెడ్డి కి ఉత్తమ అవార్డు
ఉత్తమ ఎంపిడిఓ గా కణేకల్లు ఎంపిడిఓ విజయ సింహరెడ్డి అవార్డు అందుకున్నారు. జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా డిప్యూటీ ఎంపిడిఓ లు, పంచాయతీ అభివృద్ధి అధికారులు, సిబ్బంది కి అవార్డు లను అందజేశారు. శుక్రవారం అనంతపురంలో MP అంబికా లక్ష్మీ నారాయణ, ZP చైర్ పర్సన్ గిరిజమ్మ, ZP CEO నాగరాజు నాయుడు ల చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. స్వచ్చ రథం సేవలో కణేకల్ రాజశేఖర్ కు కూడా ఉత్తమ సేవలకుగానూ సర్టిఫికెట్ అందజేశారు.