కొండపి: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎస్పీ ఆదేశాలతో క్రికెట్ బెట్టింగ్ల నిర్మూలనకు మొబైల్ ఫోన్లు తనకి చేసి యాప్లను తొలగించిన పోలీసులు
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో ఆదివారం పోలీసులు క్రికెట్ బెట్టింగ్ పై దృష్టి సారించారు. హోటల్లు, టీ స్టాల్స్ వద్ద ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు చూస్తున్న యువత మొబైల్ ఫోన్లను పోలీసులు తనిఖీ చేశారు. బెట్టింగ్ యాప్లు ఉంటే వెంటనే ఆ మొబైల్ ఫోన్లో నుంచి యాప్లను డిలీట్ చేయించి వారి తల్లితండ్రులను పిలిపించి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. యువత తమ భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని క్రికెట్ బెట్టింగ్ కు దూరంగా ఉండాలని తెలిపారు.