మార్కాపురం: కొనకనమిట్ల పోలీస్ స్టేషన్ ముందు జగదీష్ అనే వ్యక్తి ఆత్మహత్య ప్రయత్నం వివరాలు వెల్లడించిన సిఐ రాజేష్ కుమార్
మార్కాపురం జిల్లా కొనకనమిట్ల పోలీస్ స్టేషన్ ముందు జగదీష్ అనే వ్యక్తి సోమవారం సాయంత్రం పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేసిన విషయం తెలిసినదే. ఈ సంఘటన వివరాలను పొదిలి సీఐ రాజేష్ కుమార్ వెల్లడించారు. పోలీస్ స్టేషన్ లో తనపై ఫిర్యాదు చేసిన భార్య తన వద్దకు రాలేదని మనస్థాపానికి గురైన జగదీష్ ముందు ప్లాన్ ప్రకారమే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేసినట్లు తెలిపారు. ఇందులో పోలీసుల ప్రమేయం ఏమీ లేదు అన్నారు.