🌱 అటవీశాఖ ఆధ్వర్యంలో విత్తన బంతుల వెదజల్లే కార్యక్రమం
తర్లుపాడు: మండలంలోని కలుజువ్వాలపాడు పంచాయతీలో అటవీశాఖ ఆధ్వర్యంలో విత్తన బంతులు వెదజల్లే కార్యక్రమం నిర్వహించారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ హనుక్ ఆధ్వర్యంలో నవోదయ-2 విద్యార్థులు విత్తన బంతులను అటవీ ప్రాంతాల్లో వెదజల్లారు. 🌱
అటవీ విస్తీర్ణాన్ని పెంచడం, పర్యావరణ పరిరక్షణ, పచ్చదనాన్ని అభివృద్ధి చేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ప్రకృతి పరిరక్షణపై అవగాహన కల్పించారు.