తాడిపత్రి: తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ స్టంట్ లు చేస్తున్న ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు యువకులు బైక్ స్టంట్ లు చేస్తున్న ఇద్దరు యువకులను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు యువకులు ఆదివారం సాయంత్రం తిరిగి సోమవారం ఉదయం బైక్ స్టంట్ లు చేయడంతో పాటు ర్యాష్ డ్రైవింగ్ చేశారు. స్థానికులు ద్వారా సమాచారం తెలుసుకున్న సిఐ శివ గంగాధర్ రెడ్డి పోలీస్ సిబ్బందితో కలిసి ఆ ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చారు. మరోసారి బైక్ స్టంట్ లు చేసినా, ర్యాష్ డ్రైవింగ్ చేసిన చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.