గిద్దలూరు: రాచర్ల మండలం జె పి చెరువు గ్రామంలో ఘనంగా నెమలిగుండ్ల రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలు, హాజరైన ఎంపీ, మంత్రి, ఎమ్మెల్యేలు
మార్కాపురం జిల్లా రాచర్ల మండలం జెపి చెరువు గ్రామ సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం స్వామి వారి కళ్యాణం మహోత్సవం కావడంతో కార్యక్రమానికి ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామితో పాటు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి కార్యక్రమానికి హాజరయ్యారు. స్వామివారి కల్యాణ మహోత్సవములో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.