దర్శి: ఈదర గ్రామంలో అష్ట పద్మలంకమ్మ తిరుణాలలో ప్రభలపై సందడి చేసిన డాన్సర్లు
ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలోని ఈదర గ్రామంలో అష్టపద్మలంకమ్మ తిరునాళ్ల మంగళవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తిరుణాల సందర్భంగా రాజకీయ పార్టీలు రెండు విద్యుత్ ప్రభల ఏర్పాటు చేశారు. ప్రభలపై డాన్సర్లు డాన్సులతో సందడి చేస్తూ ప్రేక్షకులను అలరించారు. ఈవెంట్స్ బృందాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.