రాయదుర్గం: రెవెన్యూ సమస్యల శాశ్వత పరిష్కారమే లక్ష్యం : జిల్లా కలెక్టర్ ఆనంద్
రెవెన్యూ సమస్యల శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఒక గ్రామం - నాలుగు సందర్శనలు కార్యక్రమం శరవేగంగా సాగుతోందని జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలియజేసారు. శుక్రవారం రాయదుర్గంలో మీడియాతో ఆయన మాట్లాడారు. గతంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులకు, ఈ కార్యక్రమానికి చాలా వ్యత్యాసం ఉందని, గతంలో గ్రామాల నుంచి అర్జీలు తీసుకుని తహసిల్దార్ లేదా ఆర్డీఓ ఆఫీసుల్లో పరిష్కరించేవారని, కానీ ఇప్పుడు, సమస్యల పూర్తి నివారణ కోసం ప్రతివారం ఒక తహసిల్దార్ ఒకే గ్రామాన్ని వరుసగా నాలుగు వారాల పాటు సందర్శిస్తారన్నారు. మొదటి వారం గ్రామంలో ముందస్తుగా దండోరా వేయించి ప్రచారం కల్పిస్తారని వివరించారు.