గిద్దలూరు: గిద్దలూరు మండలం తాళ్లపల్లి గ్రామంలో జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మెగా రక్తదాన శిబిరం
సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు పురస్కరించుకొని మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం తాళ్లపల్లి గ్రామంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎన్టీఆర్ అభిమానులు పాల్గొని రక్తదానాన్ని చేశారు. జూనియర్ ఎన్టీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించి ప్రజలను అలరించాలని కోరుకుంటున్నట్లు RAW NTR టీం సభ్యులు మరియు గ్రామ పెద్దలు, అలాగే ఎన్టీఆర్ యూత్ సభ్యులు అన్నారు. అలానే ఈరోజు రాత్రి దాదాపు 400 మందికి పైగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని అన్నారు.