మార్కాపురం: జిల్లా అభివృద్ధిపై కలెక్టర్ విజయ సునీతతో చర్చించిన ఎంపీ శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు
మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నూతనంగా ఏర్పడిన జిల్లా అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ విజయ సునీతతో ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఎర్రగొండపాలెం టిడిపి ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ నూతన జిల్లా రూపురేఖలు మార్చడానికి పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు తెలిపారు. జిల్లాను అభివృద్ధి చేయడానికి నిధులు సమకూర్చడం తదితర అంశాలను చర్చించుకోవడం జరిగిందన్నారు. జిల్లాలోని వివిధ శాఖలలో అధికారులు లేకపోవడంతో కార్యక్రమాలు చేయలేకపోతున్నామని కలెక్టర్ అన్నారు.