మార్కాపురం: ప్రకాశం జిల్లా ఇంటలిజెన్సీ డిఎస్పి శ్రీరామ్ అకాల మృతికి పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి
ప్రకాశం జిల్లా ఇంటెలిజెన్సీ డిఎస్పి వేమూరి శ్రీరామ్ తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. మార్కాపురం పట్టణ పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా పనిచేసి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ఇప్పటికీ ఈ ప్రాంత ప్రముఖులతో అనుబంధం ఉంది. ఆయన మరణ వార్త వినగానే పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు