కొండపి: సింగరాయకొండ మండలం పాకాల లో నాలుగు జిల్లాలకు చెందిన జాలర్లు సమావేశం, తమిళనాడు జాలర్ల చోర బాటును అడ్డుకోవాలని తీర్మానం
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాలలో సోమవారం తిరుపతి, నెల్లూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు చెందిన జాలర్లు సమావేశమయ్యారు. తమిళనాడుకు చెందిన మరబొట్లు మన ప్రాంతంలోకి ప్రవేశించడంపై జాలర్లు చర్చించారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తమిళనాడు జాలర్లను తమ ప్రాంతంలోకి ప్రవేశించకుండా అడ్డుకోవాలని జాలర్లు తీర్మానించారు. దీనివల్ల తమ సముద్ర తీరంలోని మత్స్య సంపద కోల్పోతున్నట్లు సాలర్లు ఆవేదన వ్యక్తం చేశారు.