యర్రగొండపాలెం: రాజంపల్లి గొడ్రాలి కొండ తిరుమలనాథ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా కళ్యాణ మహోత్సవం
మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం రాజంపల్లి గ్రామ సమీపంలో వెలిసిన గొడ్రాలి కొండ తిరుమలనాథ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున శ్రీదేవి భూదేవి సమేత తిరుమలనాథ స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిపించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. అనంతరం శాస్రోప్తకంగా వేదమంత్రాలు మధ్య కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.