రాయదుర్గం: ఘర్షణలకు తావులేకుండా ప్రశాంతంగా జీవించాలి : సిఐ జయనాయక్
గ్రామాల్లో ఎలాంటి ఘర్షణలకు తావులేకుండా ప్రశాంతంగా జీవించాలని రాయదుర్గం సీఐ జయనాయక్ కోరారు. శుక్రవారం రాత్రి రాయదుర్గం మండలం డి.కొండాపురం, గొల్లలదొడ్డి గ్రామాల్లో పర్యటించి ప్రజలతో సమావేశమయ్యారు. జూదం, దొంగతనాలు వంటి నేరాలకు దూరంగా ఉండాలని, పిల్లల చదువుపై శ్రద్ధ వహించాలని సూచించారు. చట్టాలపై అవగాహన కల్పించి శాంతిభద్రతలకు సహకరించాలని కోరారు. ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకువచ్చి పరిష్కారించుకోవాలన్నారు.