యర్రగొండపాలెం: ఎర్రగొండపాలెం మండలం మురారి పల్లి సమీపంలో మొక్కజొన్న లోడుతో వెళ్తున్న లారీ బోల్తా
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం మండలం మురారి పల్లి సమీపంలో మొక్కజొన్న తీసుకెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ క్లీనర్ కు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు 108 వాహనంలో తరలించారు. లారీ బోల్తా పడటంతో అందులో ఉన్న మొక్కజొన్న సంచులు చిందరవందరగా పడిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకొని పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు.