రాయదుర్గం: బిఆర్ నాయుడును టిడిపి చైర్మన్ పదవి నుంచి తొలగించాలి : వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మెట్టువిశ్వనాథ్ రెడ్డి
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడును వెంటనే పదవి నుంచి తొలగించాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మెట్టువిశ్వనాథ్ రెడ్డి డిమాండ్ చేశారు. బిఆర్ నాయుడును పదవి నుంచి తొలగించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు మంచిబుద్ది ప్రసాదించాలంటూ శనివారం రాయదుర్గం పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయంలో ఆ పార్టీ నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బిఆర్ నాయుడు కలంకిత వ్యక్తి అని, అతనిపై అనేక ఆరోపణలు ఉన్నాయని పవిత్రమైన వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ పదవికి అర్హుడు కాదని మెట్టు విశ్వనాథరెడ్డి మీడియాతో తెలిపారు.