రాయదుర్గం: ఖరీఫ్‌లో మెరుగైన దిగుబడులే లక్ష్యం: ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు
ఎల్ నినో వల్ల వర్షాలు తగ్గే అవకాశం ఉన్నందున, ఈ ఖరీఫ్‌లో మెరుగైన దిగుబడుల కోసం రైతులకు సకాలంలో సాంకేతిక సలహాలు ఇవ్వాలని వ్యవసాయ సిబ్బందిని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవఢ శ్రీనివాసులు ఆదేశించారు. గురువారం రాయదుర్గంలో వ్యవసాయ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. విత్తనాలు, ఎరువులు సకాలంలో అందించాలని, వేరుశనగకు బదులు కంది, ఆముదం, ఉలవ, కొర్ర వంటి వర్షాభావ పంటలను ప్రోత్సహించాలని సూచించారు. బొమ్మనహల్, కనేకల్‌లో వరి సాగు ఎక్కువగా ఉండటంతో యూరియా కొరత రాకుండా ముందస్తు ప్రణాళికలు పంపాలని, ఈ-క్రాపింగ్‌లో రైతు వివరాలు న