కొండపి: ప్రమాదాలకు నిలయంగా మారిన సింగరాయకొండ లోని ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఏరియా, అసంపూర్తి నిర్మాణాలే కారణమంటున్న వాహనదారులు
ప్రకాశం జిల్లా సింగరాయకొండ పరిధిలోని ఎమర్జెన్సీ లాండింగ్ పరిధి ప్రమాదాలకు నిలయంగా మారింది. అత్యవసర సమయంలో 16 నెంబర్ జాతీయ రహదారిపై ఎమర్జెన్సీ విమానాల ల్యాండింగ్ కోసం అధికారులు నిర్మాణ పనులు చేపట్టారు. అప్పటినుంచి పనులు అసంపూర్తిగా సాగుతున్నాయే ఉన్నాయి. అయితే తరచూ ఈ ప్రాంతంలో ప్రమాదాలు జరగడంపై వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాల నివారణకు అధికారులు కృషి చేయాలని వాహనదారులు కోరుతున్నారు.