మార్కాపురం: డిసెంబర్ నాటికి వెలిగొండ ప్రాజెక్టు నుండి కృష్ణా జలాలు విడుదల : ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి
మే 27, 28వ తేదీలలో నియోజకవర్గంలో జరిగే వర్చువల్ మహానాడు కు సంబంధించి మార్కాపురం టిడిపి కార్యాలయంలో క్లస్టర్ యూనిట్ ఇన్చార్జిలతో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గతానికి భిన్నంగా జరుగుతున్న వర్చువల్ మహానాడు ను దిగ్విజయం చేయాలన్నారు. వెలుగొండ ప్రాజెక్టు పై ఏకగ్రీవ తీర్మానం చేయాల్సి ఉందన్నారు. సెప్టెంబర్ కల్లా పూర్తి చేసి డిసెంబర్ కల్లా కృష్ణాజలాలు వస్తాయన్నారు.