గిద్దలూరు: గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసి అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
మార్కాపురం జిల్లా గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రిని మంగళవారం స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పరిశీలించి అధికారులకు తగు సూచనలు సలహాలు ఇచ్చారు. గతంలో 40 పడకలగా ఉన్న ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దబోతున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు తదితరులు పాల్గొన్నారు.