మార్కాపురం: జిల్లా కేంద్రంలో ఘనంగా మహానాడు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి
మార్కాపురం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాలులో వర్చువల్ మహానాడు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏదైనా అభివృద్ధి జరిగిందంటే తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని అన్నారు. గత ప్రభుత్వంలో చేసింది ఏమీ లేదని శూన్యం మాత్రమే అన్నారు. పార్టీని ప్రజల ఆదరించాలని కోరారు.