కొండపి: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో డ్రోన్ సహాయంతో అణువణువుని వెల్లడి పడుతున్న ప్రకాశం పోలీసులు
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పోలీసులు స్కై ప్రాజెక్టు ద్వారా అను అనువుని పరిశీలిస్తున్నారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు డ్రోన్స్ సహాయంతో నిర్మానుష ప్రదేశాలను పరిశీలించారు. కోడి పందాలు పేకాట వంటివి నిర్మూలించడమే కాకుండా గంజాయి వంటి వాటికి చెక్ పెట్టవచ్చని తెలిపారు. అలానే ఇటీవల అత్యధికంగా దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో వాటిని నిర్మూలించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.