రాయదుర్గం: 5 నెలలుగా వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నాం : సత్యసాయి తాగునీటి కార్మికులు
5 నెలలుగా వేతనాలు లేక తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సత్యసాయి తాగునీటి పథకంలో పని చేసే కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ పోషణ భారమైందని, పిల్లల చదువుల ఖర్చులకు, తాము వచిపోయేందుకు కూడా డబ్బులు లేవని డి.హిరేహాల్ మండలంలోని గొడిశలపల్లిలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా 550 మంది పనిచేస్తున్నామని తమకు తక్షణమే బకాయి వేతనాలు చెల్లించాలని, నెలనెల క్రమం తప్పకుండా వేతనాలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే ఈనెలహ25 నుంచి సమ్మకు వెనుకాడమని ప్రకటించారు.