యర్రగొండపాలెం: దోర్నాల మండలం బలిజపల్లె గూడెం సమీపంలో కొండను తవ్వుతున్న మట్టి మాఫియా
మార్కాపురం జిల్లా దోర్నాల మండలం బలిజపల్లి గూడెం సమీపంలోని రెవెన్యూ కొండలో మట్టి మాఫియా యదేచ్చగా అక్రమ తౌకాలను నిర్వహిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. భారీ యంత్రాలతో కొండను తవ్వి మట్టిని తరలిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వ భూమిని బహిరంగంగా దోచుకుంటున్న అధికారులు మౌనం పాటించడం పలు అనుమానాలకు తావిస్తుందని గ్రామస్తులంటున్నారు.