రాయదుర్గం: మహిళలు, బాలబాలికల బద్రత అందరి భాధ్యత : డిఎస్పీ రవిబాబు
మహిళలు బాలబాలికల భద్రత అందరి భాధ్యత అని డిఎస్పీ రవిబాబు అన్నారు. డి.హిరేహాల్ మండలంలోని మురడి గ్రామంలో రూరల్ సిఐ వెంకటరమణ ఆధ్వర్యంలో సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన డిఎస్పీ మాట్లాడుతూ శక్తి యాప్ ప్రతీ మహిళ తన స్మార్ట్ ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకోవాలని కోరారు. దీని వల్ల ఆపద సమయాల్లో పోలీసు సేవలు పొందవచ్చని వివరించారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ హనుమంతరెడ్డి, టిడిపి మండల కన్వీనర్ మోహన్ రెడ్డి, ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు.