యర్రగొండపాలెం: ఫీల్డ్ మ్యాప్ ప్రకారం 24 ఎకరాలు ఉంటే 40 ఎకరాలు ఆన్లైన్ చేశారని న్యాయవాది రామయ్య కలెక్టర్ విజయ సునీతకు వినతి
పెద్దారవీడు మండలం గొబ్బూరు గ్రామానికి చెందిన న్యాయవాది కడియం రామయ్య తమ సమస్యను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ విజయ సునీతకు వినతిపత్రం అందజేశారు. రామయ్య మాట్లాడుతూ... మండలంలోని తోకపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 300/1లో ఫీల్డ్ మ్యాప్ ప్రకారము 24 ఎకరాల 90 సెంట్లు ఉండగా 40 ఎకరాలు ఉన్నట్లు ఆన్లైన్ చేయడం జరిగిందన్నారు. వారికి సంబంధించిన భూమి ఎక్కడుందో తెలియదు కానీ నిజమైన రైతులకు భూమి ఆన్లైన్ చేయకుండా గందరగోళం పరిస్థితి నెలకొన్నది అన్నారు. తన మామయ్య 15 సంవత్సరాలుగా కార్యాలయం చుట్టూ తిరిగి తిరిగి చనిపోయారు అన్నారు. అధికారులకు ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చిన ఎంక్వయిరీ చేయలేదన్నారు.