కళ్యాణదుర్గం: ఎర్రగుంట లో తీవ్ర తాగునీటి ఎద్దడి, నీటి కోసం అష్ట కష్టాలు పడుతున్న గ్రామస్తులు
కుందుర్పి మండలం ఎర్రగుంట లో లో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. గత కొన్ని రోజులుగా తాగునీటి కోసం గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామపంచాయతీ, మండల పరిషత్ అధికారులకు తాగునీటి సమస్య గురించి గ్రామస్తులు తెలియజేశారు. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. డబ్బున్న వారు వాటర్ కొని తెచ్చుకుంటున్నారు. పంచాయతీ అధికారులు స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని సోమవారం పలువురు గ్రామస్తులు కోరారు.