రాయదుర్గం: పట్టణంలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు
*రాయదుర్గంలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు* ప్రజాస్వామ్య పరిరక్షణ, సామాజిక న్యాయం, యువత సాధికారత, రైతు సంక్షేమం కోసం నిరంతరం పోరాడుతున్న ప్రజానాయకుడు రాహుల్ గాంధీ అని యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు ఊరువాకిలి అనిల్ కుమార్ కొనియాడారు. శుక్రవారం రాహుల్ గాంధీ జన్మదినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ రాయదుర్గం నియోజకవర్గ ఇంచార్జ్ గౌని ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాయదుర్గంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.