యర్రగొండపాలెం: త్రిపురాంతకం లోని ఉప్పలగుట్ట కాలనీలో కార్డెన్ సెర్చ్ నిర్వహించిన సీఐ అస్సాన్
మార్కాపురం జిల్లా త్రిపురాంతకం లోని ఉప్పలగుట్ట కాలనీలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణ అక్రమ కార్యకలాపాల అరికట్టడమే లక్ష్యంగా ప్రతి ఇంటిని తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 31 బైకులను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి ఆన్లైన్ బెట్టింగులు ఓటిపి మోసాల పై కాలనీవాసులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సిఐ అస్సాన్ ఎస్ఐ శివరామయ్య తదితరులు పాల్గొన్నారు.