రాయదుర్గం: గ్రామదట్ల గ్రామంలో కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
చంద్రబాబు ప్రభుత్వం రైతులకు మేలు చేసే ప్రభుత్వం అని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు పేర్కొన్నారు. సోమవారం రాయదుర్గం మండలం గ్రామదట్ల గ్రామంలో రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. అంతకు ముందు నూతన ఆర్ఓ ప్లాంట్ ను ప్రారంభించారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ హనుమంతరెడ్డి, ఎంపిడివో కొండన్న, తహసీల్దార్ సూర్యప్రతాప్, మండల కన్వీనర్ హనుమంతు, మాజీ సర్పంచ్ రాజశేఖర్ పాల్గొన్నారు.