మార్కాపురం: జీపు మోటార్స్ కార్మికులకు ప్రభుత్వం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి : ఏఐటీయూసీ
మార్కాపురం పూల సుబ్బయ్య శాంతిభవన్ లో ఏఐటియుసి జీపు మోటర్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. యూనియన్ గౌరవ అధ్యక్షులు నాసరయ్య మాట్లాడుతూ... జీపు మోటార్స్ కార్మికులకు ప్రభుత్వమే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. ప్రమాదం జరిగితే పది లక్షలు ఇవ్వాలని, సహజ మరణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలన్నారు. పీఎఫ్ ఈఎస్ఐ అమలు చేయాలన్నారు. ఇండ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా దేవి రెడ్డి ప్రధాన కార్యదర్శిగా దాసును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.