మార్కాపురం: రాములవీడు గ్రామంలో తమను మోసం చేయడంతో తన భర్తను కోల్పోయామని తనకు న్యాయం చేయమని బాధితురాలు వెంకట శ్రావణి విజ్ఞప్తి
మార్కాపురం జిల్లా పొదిలి మండలం రాములవీడు గ్రామానికి చెందిన మేరీ బాబు తెలివిగా మోసం చేయడంతో తన భర్త గడ్డి పురుగుల మందు తాగి చనిపోయారని బాధితురాలు వెంకట శ్రావణి తెలిపారు. సబ్సిడీ డబ్బుల కోసం ఇంటి డాక్యుమెంట్ అతనికి ఇచ్చామన్నారు. దీనితో బ్యాంకులో తనఖా పెట్టి నగదు కాజేశారు. దీంతో బ్యాంక్ అధికారులు తమపై ఒత్తిడి చేస్తున్నారని అన్నారు. సమస్య పరిష్కరించాలని లేకపోతే పిల్లలతో పాటు తను కూడా చనిపోతానని హెచ్చరించారు.