గిద్దలూరు: కంభం మండలం కందులాపురంలో జరిగిన సోమదేశ్వర స్వామి తిరుణాల మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
మార్కాపురం జిల్లా కంభం మండలం కందులాపురం గ్రామంలో సోమవారం జరిగిన సోమదేశ్వర స్వామి తిరుణాల మహోత్సవంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజ కార్యక్రమాలలో పాల్గొని శివలింగానికి జలాభిషేకం చేశారు. తర్వాత అర్చకులు అందించిన తీర్థప్రసాదాలు స్వీకరించారు. తర్వాత ఎమ్మెల్యే అశోక్ రెడ్డి రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.