గిద్దలూరు: గిద్దలూరు నియోజకవర్గంలోని ఐదు మండలాలను భారీ వర్షం, ఈదురు గాలులు ఉరుములు మెరుపులతో విద్యుత్ సరఫరాకు అంతరాయం
మార్కాపురం జిల్లా కంభం, కొమరోలు, బేస్తవారిపేట, అర్ధవీడు, రాచర్ల ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలు ఉక్కపోతకు గురయ్యారు. సోమవారం కంభంలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 44.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా వాతావరణం చల్లబడి బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. వాతావరణం చల్లబడడంతో ప్రజలు తీవ్ర ఉక్కపోత నుంచి ఉపశమనం పొందారు. కొన్ని ప్రాంతాలలో ఈదురు గాలుల వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఉరుములు, పిడుగులు ప్రజలని ఆందోళనకు గురిచేశాయి.