గిద్దలూరు: కంభం మండలంలోని చెరువు కట్టపై జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ విజయ సునీత, ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
ఆసియా ఖండంలోనే అతిపెద్ద చెరువులలో రెండవదైన మార్కాపురం జిల్లా కంభం చెరువు కట్టపై యోగాంధ్ర కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. కలెక్టర్ విజయ సునీత, స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు వేశారు. యోగ గురువులు యోగాసనాలు వేయడం వల్ల కలుగు ప్రయోజనాలను వివరిస్తూ అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజల చేత యోగాసనాలు వేయించారు. దాదాపు కంభం చెరువు కట్టపై 2000 మందికి పైగా ఏకకాలంలో యోగాసనాలు వేశారు.