యర్రగొండపాలెం: వీరభద్రపురం గ్రామంలో మేక పిల్లల మేత కోసం వెళ్లి విద్యుత్ షాక్ తో యువకుడు నాగరాజు మృతి
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం మండలం వీరభద్రపురం గ్రామంలో విద్యుత్ షాక్ తో మేకల నాగరాజు అనే యువకుడు మృతి చెందాడు. మేక పిల్లల మేత కోసం చెట్టు పైకి ఎక్కిన నాగరాజుకు విద్యుత్ తీగలు తగిలి చెట్టు పైనే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకొని పరిశీలించారు. మృతుడికి నాలుగు నెలల క్రితమే వివాహం జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.