కనిగిరి: జిల్లాల్లో హాట్ టాపిక్ గా మారిన వైసిపి అధ్యక్షుడు బూచేపల్లి వీడియో, సంక్షేమ పథకాలు చంద్రబాబు అమలు చేస్తున్నారంటూ వైరల్
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో శుక్రవారం వైసీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలతో కదం తొక్కారు. అయితే జిల్లా వైసీపీ అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడిన ఒక వాయిస్ ప్రస్తుతం వైరల్ గా మారింది. సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత జగన్దే అని అనబోయి చంద్రబాబుదేననీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది. అయితే ఇది పొరపాటున బూచేపల్లి అన్నారా లేదా మార్ఫింగ్ జరిగిందా అనేది తెలియవలసి ఉంది.